పోలీసుల అదుపులో నారా లోకేష్​

By udayam on September 9th / 9:17 am IST

గుంటూరు జిల్లా గోళ్ళపాడులో హత్యకు గురైన అనూష ఫ్యామిలీని పరామర్శించడానికి వెళ్తున్న టిడిపి నేత నారా లోకేష్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు ఉదయం ఆయన హైదరాబాద్​ నుంచి గన్నవరం విమానాశ్రాయానికి చేరుకున్నారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించి ఆయనను ముందు జాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం లోకేష్​ను ఎక్కడికి తరలించారన్న విషయంపై స్పష్టత లేదు. తాను కేవలం పరామర్శకే వెళ్తున్నానని, ధర్నాలు, రాస్తారోకోలు చేసే ఉద్దేశ్యం లేదని అంతకు ముందు లోకేష్​ వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్​