ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో పాదయాత్ర కు రంగం సిద్ధమైంది. ఈసారి టిడిపి యువ నేత నారా లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది జనవరి 27 నుంచి ఆయన పాదయాత్ర కుప్పం నుంచి ప్రారంభం కానుంది. ఈ పాదయాత్రకు పేరు, తేదీ ఖరారైనా ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మొత్తం 400 రోజులు 4వేల కిలోమీటర్లు రాష్ట్రమంతా పర్యటించనున్నారు నారా లోకేశ్. కుప్పం నుంచి మొదలయ్యే పాదయాత్ర ఇచ్ఛాపురం వరకు జరగనుంది. మొదట్లో బస్సుయాత్ర చేపట్టాలనుకున్నా.. ప్రజల్లోకి వెళ్లాలంటే పాదయాత్ర మంచిదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.