మోదీ : ఒక్కొక్కరూ 5గురు విదేశీయుల్ని భారత్​కు పంపండి

By udayam on May 4th / 6:57 am IST

యూరప్​ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి ప్రవాస భారతీయులకు ఓ విజ్ఞప్తిని చేశారు. డెన్మార్క్​ రాజధాని కోపెన్​హెగన్​లో ఎన్​ఆర్​ఐలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన ‘నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా. మీరు తప్పనిసరిగా నా అభ్యర్థనను అంగీకరించండి. ఏటా ఐదుగురు విదేశీయుల్ని భారత్​లో పర్యటించేలా పంపించండి. అక్కడ ఎలాంటి పర్యాటక ప్రాంతాలున్నాయో వారికి వివరించి వారిలో స్ఫూర్తిని నింపండి. మీరంతా భారత్​కు ప్రతినిధుల వంటివారు’ అని మోదీ పేర్కొన్నారు.

ట్యాగ్స్​