మార్స్​పై పర్సవరెన్స్​ రోవర్​ దిగేది నేడే

ఈరోజు అర్ధరాత్రికి ల్యాండ్​ అవ్వనున్నట్లు ప్రకటించిన నాసా

By udayam on February 18th / 7:55 am IST

అమెరికా గత ఏడాది మార్స్​ గ్రహం పైకి పంపిన పర్సవరెన్స్​ రోవర్​ ఈ రోజు అర్ధరాత్రి 12.45 నిమిషాలకు అరుణగ్రహ ఉపరితలం పైకి చేరుకోనుంది.

ఇప్పటికే అరుణ గ్రహ కక్షలోకి చేరుకున్న ఈ రోవర్​ ల్యాండింగ్​కు సన్నద్ధమవుతోంది. దాదాపు ఆరున్నర నెలల పాటు దాదాపు 204.69 మిలియన్​ మైళ్ళ దూరం ప్రయాణించిన ఈ రోవర్​ మార్స్​లోని జెజెరో క్రేటర్​ వద్ద దిగనుంది.

ఈ ల్యాండింగ్​లో చివరి 7 నిమిషాలు అత్యంత కఠినంగా ఉంటాయని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది. దాదాపు 90 శాతం రోవర్లు చివరి 7 నిమిషాల వ్యవధిలోనే విఫలమయ్యాయని తెలిపింది.

ట్యాగ్స్​
Source: digitaltrends