23న ఆర్టెమిస్​ ప్రయోగం

By udayam on September 9th / 9:05 am IST

నాసా పలు మార్లు వాయిదా వేసిన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్​ ఆర్టెమిస్​ ను ఈనెల 23న తిరిగి ప్రయోగించడానికి సన్నాహాలు చేస్తోంది. ఆరోజు కుదరకపోతే ఇదే నెల 27న మరోసారి ప్రయత్నించనున్నట్లు పేర్కొంది. గతంలో సెప్టెంబర్​ 3న ఒకసారి, 5న మరోసారి ఈ ప్రయోగాన్ని చేపట్టడానికి నాసా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మూడు ఇంజిన్లలో ఒక దాంట్లో లీకేజీ సమస్య తలెత్తడంతో ప్రయోగాన్ని వాయిదా వేశారు.

ట్యాగ్స్​