భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో, అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాల జాయింట్ మిషన్ నిసార్ (సింథటిక్ అపెట్యూర్ రాడార్) పేలోడ్ ఇంటిగ్రేషన్ పూర్తయింది. ఈ రెండు స్పేస్ ఏజెన్సీలు కలిపి అభివృద్ధి చేస్తున్న నిసార్ శాటిలైట్ ద్వారా భూమి గురుత్వాకర్షణ శక్తితో పాటు ధృవాల వద్ద ఉన్న క్రైసోఫియర్ను సైతం నిరంతరం గమనిస్తూ ఉంటుంది. ఈ మేరకు డాక్టర్ థోమస్ జుర్బుకెన్ ఆధ్వర్యంలోని నాసా ప్రతినిధుల బృందం భారత్ చేరుకుని ఇస్రో ప్రతినిధులతో చర్చలు జరిపింది.