నాసా: చంద్రునిపైకి బయల్దేరిన ఆర్టెమిస్​ 1

By udayam on November 16th / 8:44 am IST

చంద్రునిపై శాశ్వత నివాసం.. ఆపై అక్కడి నుంచే అరుణ గ్రహ ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లలో భాగంగా నాసా ఆర్టెమిస్​ 1 రాకెట్​ ను విజయవంతంగా ప్రయోగించింది. బుధవారం రాత్రి 1.43 నిమిషాలకు కెనడీ స్పేస్​ సెంటర్​ నుంచి నిప్పులు కక్కుతూ ఈ 32 అంతస్తుల భారీ రాకెట్​ చంద్రుని వైపు తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. మనుషులు ఇప్పటి వరకూ నిర్మించిన అతిపెద్ద రాకెట్​ ఇదే.ఆర్టెమిస్​ సిరీస్​ లో ప్రయోగించిన ఈ తొలి రాకెట్​ ప్రయోగం ఇప్పటికి 2 నెలల్లో 2 సార్లు వాయిదా పడింది. 1966–22 ల తర్వాత అమెరికా ఇప్పటి వరకూ మనుషులను చంద్రుని పైకి పంపలేదు. దాదాపు 50 సంవత్సరాల తిరిగి అమెరికన్లను చంద్రుని వైపు పంపడంలో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు.

ట్యాగ్స్​