గురు, శని గ్రహాల కలయిక చందమామ నుంచి ఇలా

ఫొటో విడుదల చేసిన నాసా

By udayam on December 23rd / 9:46 am IST

డిసెంబర్​ 21న గురు, శనిగ్రహాలు కలిసి ఆకాశంలో మరింత ప్రకాశవంతంగా కనిపించిన విషయం తెలిసిందే. అయిదే ఈ ఖగోళ వింతను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) చందమామ మీద ఉన్న తన ఉపగ్రహాల ద్వారా బంధించింది.

ఇందుకు సంబంధించిన చిత్రాన్ని విడుదల చేసింది. అత్యంత చీకటి ప్రాంతంగా ఉండే చందమామ వెనుక వైపు నుంచి ఈ దృశ్యాన్ని బంధించినట్లు చిత్రాన్ని చూస్తే తెలుస్తోంది.

400 ఏళ్ళ క్రితం జరిగిన ఈ అద్భుత దృశ్యం తిరిగి ఏర్పడిన సందర్భంగా నాసా ఈ ప్రత్యేక సందర్భాన్ని చందమామ మీద నుంచి చిత్రీకరించడానికి ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.