గెలాక్సీలు డ్యాన్స్​ చేస్తుంటే చూశారా! : నాసా

By udayam on October 9th / 7:34 pm IST

భూమికి 10 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న రెండు గెలాక్సీలు ఒకదానితో ఒకటి కలిసిపోతున్న అద్భుత ఫొటోను నాసా క్లిక్​ మనిపించింది. హబుల్​ టెలిస్కోప్​ తీసిన ఈ ఫొటోను ట్విట్టర్​లో షేర్​ చేసిన నాసా ‘డ్యాన్సింగ్​ గెలాక్సీస్​’ అంటూ వాటికి పేరు పెట్టింది. ఈ రెండు గెలాక్సీల కలయికతో భారీ గెలాక్సీ ఏర్పడుతుందని ఖగోళ శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు.