సక్సెస్​: ఆస్టరాయిడ్‌ను ఢీకొట్టిన నాసా స్పేస్‌క్రాఫ్ట్

By udayam on September 27th / 6:41 am IST

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 2021లో ప్రయోగించిన డార్ట్​ స్పేస్​ క్రాఫ్ట్​ ఓ ఆస్టరాయిడ్​ను విజయవంతంగా ఢీకొట్టింది. ఈ కవల గ్రహశకలాలు మన గ్రహానికి ఏదో రోజు ముప్పుగా మారుతుందని భావించి నాసా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. డిమార్ఫోస్ అని పిలుస్తున్న ఈ ఆస్టరాయిడ్ 160 మీటర్ల నిడివి ఉంది. డార్ట్ స్పేస్ ప్రోబ్ దీనిని ఢీకొట్టే క్షణం వరకూ తన దగ్గరున్న కెమెరాతో సెకనుకు ఒక ఫొటో చొప్పున పంపించింది. ఆస్టరాయిడ్‌ను ఢీకొట్టి డార్ట్ ధ్వంసం కావటంతో ఫొటోల ప్రవాహం ఆగిపోయింది. ఈ ఢీకొట్టే ప్రక్రియలో ఆస్టరాయిడ్​ తన గమనాన్ని మార్చుకుని భూమి నుంచి దూరంగా ప్రయాణిస్తుందని తెలుస్తోంది.

ట్యాగ్స్​