నాసాలో ఉద్యోగం కొట్టాలంటే పెద్ద చదువు, భారీ కాయం కావాలని మీరు భావిస్తే అది పూర్తిగా తప్పు.. ఎందుకంటే ఆ సంస్థ యూరోపియన్ యూనియన్ తో కలిపి చేస్తున్న ఆర్టిఫియల్ గ్రావిటీ బెడ్ రెట్ స్టడీ కోసం 24–55 ఏళ్ళ మధ్య ఉన్న 12 మంది మగ, 12 మంది ఆడవారి కోసం వెతుకుతోంది. వీరికి ఎలాంటి క్వాలిఫికేషన్ తో కానీ బాడీ ఫిట్ నెస్ తో కానీ పనిలేదు. వీళ్ళు చేయాల్సిందల్లా 60 రోజుల పాటు కదలకుండా సింథటిక్ గ్రావిటీ బెడ్ లపై నిద్రించడమే. భోజనం, కాల కృత్యాలు కూడా బెడ్ మీద పడుకునే చేయాల్సి ఉంటుంది. ఆస్ట్రోనాట్ల లాంగ్ జర్నీల్లో నిద్ర సమయంలో వచ్చే మార్పుల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఇలా నిద్రపోయే వారికి నెలకు 1.53 లక్షల జీతం ఇవ్వనుంది.