ఎర్త్​ సెట్​: భూమిని ఫొటో తీసిన ఓరియన్​ క్యాప్సూల్​

By udayam on November 22nd / 10:45 am IST

నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్‌-1 వ్యోమనౌక విజయవంతంగా చంద్రుని కక్ష్య లోకి చేరుకుంది. త్వరలోనే ఓరియన్​ క్యాప్యూల్​ చంద్రుడి ఉపరితలంపై 81 మైళ్ళ ఎత్తులోకి దూసుకెళ్ళి గతంలో అపోలో మిషన్స్ పేరిట ఉన్న రికార్డును చెరిపేయనుంది. ఈ క్రమంలోనే ఓరియన్​ స్పేస్​ క్రాఫ్ట్​ చంద్రుని ఉపరితలం కు అవతల ఉన్న భూమి ఫొటోను క్లిక్​ మనిపించింది. దీనిలో భూమి చిన్న లేత నీలిరంగు చుక్కలా కనిపిస్తోంది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న, కలలుగంటున్న రోజుల్లో ఇది ఒకటని నాసా డైరెక్టర్‌ జెబులున్‌ స్కోవిల్లె పేర్కొన్నారు.ఆ సమయంలో ఇది గంటకు 5,023 మైళ్ల వేగంతో ప్రయాణిస్తూ.. చంద్రునికి 328 మైళ్ల ఎత్తులో ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ట్యాగ్స్​