అరుణగ్రహంపై ఆక్సిజన్​ ఉత్పత్తి : నాసా

By udayam on April 22nd / 11:04 am IST

అరుణగ్రహ వాతావరణంలో ఉన్న అతి స్వల్ప స్థాయి కార్బన్​ డయాక్సైడ్​ను వినియోగించుకుని పర్సవరెన్స్​ రోవర్​ ఆక్సిజన్​ను ఉత్పత్తి చేసినట్లు నాసా వెల్లడించింది. రోవర్​లో ఉన్న మోక్సీ అనే పరికరం సాయంతో ఈనెల 20న ఆక్సిజన్​ను విజయవంతంగా ఉత్పత్తి చేసిందని తెలిపింది. అక్కడి వాతావరణంలో తొలిసారిగా డ్రోన్​ విమానాన్ని ఎగరవేసిన నాసా ఆ మరుసటి రోజునే ఆక్సిజన్​ను ఉత్పత్తి చేయడం గమనార్హం. ‘ఏదో ఒకరోజు మానవులు అరుణ గ్రహంపై ఆవాసం ఏర్పరచుకోవడానికి వీలుగా ఆక్సిజన్​ను ఉత్పత్తి చేసే ప్రక్రియలో ఇది తొలి అడుగు’ అని నాసా తెలిపింది.

ట్యాగ్స్​