మార్స్​పై దిగిన పర్సవరెన్స్​ రోవర్​

By udayam on February 19th / 6:27 am IST

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అరుణ గ్రహం పైకి పంపిన సరికొత్త రోవర్​ పర్సవరెన్స్​ అక్కడ ఉపరితలంపై దిగ్విజయంగా ల్యాండ్​ అయింది.

దాదాపు ఆరున్నర నెలల పాటు ప్రయాణించి ఈ రోవర్​ అరుణ గ్రహ కక్ష్యలోకి చేరుకుంది. అక్కడి జెజెరో క్రేటర్​ పరిసర ప్రాంతాల్లో ఒకప్పుడు జీవం ఉనికి ఉండేదన్న ఆనవాళ్ళను కనిపెట్టడమే లక్ష్యంగా ఈ పర్సవరెన్స్​ రోవర్​ అక్కడి నేలపై పరీక్షలు జరపనుంది.

అక్కడి ఉపరితలంపై దిగిన తర్వాత పర్సవరెన్స్​ రోవర్​లోని కెమెరాలు ఆ పరిసరాల్ని ఫొటోలు తీసి భూమికి పంపాయి. వాటిని నాసా తన ట్విట్టర్​ ఖాతాలో షేర్​ చేసింది.

ల్యాండింగ్​ను నడింపించిన భారతీయురాలు

నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ మిషన్​ ల్యాండింగ్​ను భారత సైంటిస్ట్​ డాక్టర్​ స్వాతి మోహన్​ ముందుండి నడిపించారు.

ప్రతి రోవర్​ అరుణ గ్రహ కక్ష్యపై దిగడం అత్యంత కఠినమైన సవాల్​. ల్యాండర్​ తన చివరి 7 నిమిషాలు సొంతంగానే పనిచేస్తూ ల్యాండ్​ కావాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియను ముందుగానే ప్రోగ్రామ్​ చేసిన టీంకు స్వాతి మోహన్​ నాయకత్వం వహించారు.

దాంతో పాటు ల్యాండింగ్​కు అనువైన సమయాన్ని, స్థలాన్ని ఎంపిక చేసే బాధ్యత కూడా ఆమెదే.

ట్యాగ్స్​
Source: ndtv