నక్షత్ర పుట్టుకను ఫొటో తీసిన జేమ్స్​ వెబ్​

By udayam on November 17th / 9:25 am IST

విశ్వానికి సంబంధించిన అద్భుతమైన దృశ్యాలను మనకు అందిస్తున్న జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మరోసారి అబ్బురపరిచే చిత్రాలను తీసింది. భూమికి 430 కాంతి సంవత్సరా దూరంలో.. ఇప్పుడిప్పుడే పురుడుపోసుకుంటున్న కొత్త నక్షత్రాన్ని తన కెమెరాలో బంధించింది. టారస్​ నక్షత్ర మండలంలోని ప్రోటోస్టార్​ ఎల్​1527 అనే ఈ నక్షత్రం తన చుట్టూ ఉన్న ధూళి మేఘాలను సమ్మిళితం చేస్తూ రంగురంగుల సీతాకోక చిలుక రెక్కలు ఆడిస్తున్నట్లు ఈ ఫొటోలో కనిపించింది. జేమ్స్ వెబ్ లోని నియర్​ ఇన్​ఫ్రారెడ్​ కెమెరాతో ఈ ఫొటోను క్లిక్​ చేశారు.

ట్యాగ్స్​