భారత పర్యటనకు ఇంగ్లాండ్​ జట్టు ఇదే

16 మందితో జట్టును ప్రకటించిన ఈసీబి

By udayam on January 22nd / 7:12 am IST

ఫిబ్రవరి 5 నుంచి భారత్​లో పర్యటించనున్న ఇంగ్లాండ్​ జట్టును ఇంగ్లాండ్​ అండ్​ వేల్స్​ క్రికెట్​ బోర్డ్​ (ఈసిబి) ప్రకటించింది. మొదటి, రెండవ టెస్ట్​కు మొత్తం 16 మంది ప్రాబబుల్స్​ను ఎంపిక చేసింది.

ఈ 16 మందితో పాటు 6 గురు రిజర్వ్​ ఆటగాళ్ళను సైతం ఎంపిక చేసింది ఈసిబి.

ఇంగ్లాండ్​ జట్టు ఇదే:

జో రూట్​ (కెప్టెన్​), జోఫ్రా ఆర్చర్​, మోయిన్​ ఆలి, జేమ్స్​ ఆండర్సన్​, డామ్​ బెస్​, స్టువార్ట్​ బ్రాడ్​, రోరీ బర్న్స్, జాస్​ బట్లర్​, జాక్​ క్రాలీ, బెన్​ ఫోక్స్​, డాన్​ లారెన్స్​, జాక్​ లీచ్​, డామ్​ సిబ్లీ, బెన్​ స్టోక్స్​, ఓలీ స్టోన్​, క్రిస్​ ఓక్స్​లను ఎంపిక చేసింది.

రిజర్వ్​ ఆటగాళ్ళు వీరే..

జేమ్స్​ బ్రాసీ, మాసోన్​ క్రేన్​, సకిబ్​ మహమూద్​, మాథ్యూ పార్కిన్సన్​, ఓలీ రాబిన్సన్​, అమర్​ విర్ది లను రిజర్వ్​ ఆటగాళ్ళుగా ఎంపిక చేసింది.