లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన ‘కనెక్ట్’ మూవీ నుంచి ఫస్ట్ టీజర్ లాంచ్ అయింది. సస్పెన్స్, హర్రర్ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీకి నయనతారే నిర్మాత కాగా.. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించాడు. దీనికి సంబంధించి ఈ రోజు ఈ మూవీ తెలుగు టీజర్ ను లాంచ్ చేశారు. అనుపమ్ ఖేర్, సత్యరాజ్ లు కీలక పాత్రల్లో కనిపిస్తున్న ఈ మూవీ ఈనెల 22న విడుదలకు సిద్ధమవుతోంది.