నయనతార దంపతులపై తితిదే చర్యలు!

By udayam on June 11th / 4:08 am IST

ఈ బుధవారం మూడుముళ్లు బంధంతో ఒక్కటైన హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ లపై తితిదే అధికారులు మండిపడుతున్నారు. పెళ్లి అనంతరం శుక్రవారం ఈ దంపతులు శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఈ సమయంలో తిరుమల మాడ వీధుల్లో చెప్పులతో నడిచారని కొందరు తితిదే బోర్డ్ కి ఫిర్యాదు చేశారు. దీనిపై వీడియోలు చెక్ చేసిన విజిలెన్స్ అధికారి బాలిరెడ్డి ఈ ఘటన దురదృష్టకరమని ఒప్పుకున్నారు. స్టార్ దంపతులతో పాటు, ఆ సమయంలో సెక్యూరిటీ లో వున్న వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీంతో పాటు ఆలయం ముందు ఫోటోషూట్ చేయడమూ తప్పేనని అన్నారు.

ట్యాగ్స్​