భారత్ లో రద్దైన సరోగసీ పద్దతిలో కవల పిల్లలను కన్న నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు ఎలాంటి చట్టాలను అతిక్రమించలేదని తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి వ్యాఖ్యానించారు. వారిద్దరి వివాహం 2016లోనే అయిపోయిందన్న ఆయన.. ఐసిఎంఆర్ ఇచ్చిన సరోగసీ గైడ్ లైన్స్ ను ఈ జంట పాటించిందని చెప్పుకొచ్చారు. సరోగసీ ద్వారా పిల్లలను పుట్టించిన ఆసుపత్రి.. అసలైన పేరెంట్స్ డేటాను భద్రపరచలేదని వెల్లడించారు. అంతకు ముందు నయన్ దంపతులు సరోగసీని దుబాయ్ ఆసుపత్రిలో జరిపినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.