దక్షిణాది అగ్ర నటీమణి నయనతార త్వరలోనే తన లాంగ్ టైమ్ బాయ్‌ఫ్రెండ్, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను పెళ్ళాడనుంది. ఇప్పటికే మ్యారేజ్ డేట్, ప్లేస్ కూడా ఈ జంట ఫిక్స్ చేసుకున్నట్లు కోలీవుడ్ సమాచారం. జూన్ 9న ఆంధ్రప్రదేశ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో ఈ జంట మూడు ముళ్ళ బంధంలోకి అడుగుపెట్టనుంది. పెళ్లి వేదికను బుక్ చేసుకునేందుకు ఈ జంట స్వయంగా ఈరోజు తిరుమల వచ్చారు. ‘నేనూ రౌడీనే’ సినిమా షూటింగ్ నుంచి వీరిద్దరికీ ఏర్పడ్డ పరిచయం అనంతరం ప్రేమగా మారింది.