విఘ్నేష్​ చేసిన పనికి రూ.25 కోట్లు నష్టం

By udayam on July 18th / 11:20 am IST

తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కాదని పెళ్ళి ఫొటోలను బయటపెట్టడంతో నయన్​–విఘ్నేష్​లతో కుదుర్చుకున్న ఒప్పందం నుంచి నెట్​ఫ్లిక్స్​ బయటకొచ్చేసినట్లు సమాచారం. గత నెలలో జరిగిన వీరి వివాహ స్ట్రీమింగ్​ రైట్స్​ సొంతం చేసుకున్న నెట్​ఫ్లిక్స్​ ఇందుకోసం రూ.25 కోట్లు ఇవ్వడానికి అంగీకరించింది. అయితే తమ వివాహం జరిగిన నెల రోజులు అయిందంటూ విఘ్నేష్​ కొన్ని పెళ్ళి ఫొటోలను షేర్​ చేశాడు. ఇక్కడే ఈ డీల్​ చెదిరింది. విఘ్నేష్​ ఫొటోలను షేర్​ చేయడంతో తాము డీల్​ నుంచి తప్పుకుంటున్నట్లు నెట్​ఫ్లిక్స్​ అన్నట్లు సమాచారం.

ట్యాగ్స్​