6న ఒంగోలులో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్​ ఈవెంట్​

By udayam on January 4th / 6:12 am IST

నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహరెడ్డి చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 6 న ఒంగోలు లోని ఎ.ఎమ్.బి. కాలేజ్ గ్రౌండ్స్ లో భారీ ఎత్తున నిర్వహించబోతున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు. నందమూరి బాలకృష్ణ , శృతి హాసన్ జంటగా తెరకెక్కుతున్న మూవీ వీరసింహారెడ్డి. క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ మూవీ జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా తాలూకా పోస్టర్స్ , టీజర్స్ , సాంగ్స్ ఇలా అన్ని సినిమా ఫై అంచనాలు పెంచేశాయి.

ట్యాగ్స్​