గోపీచంద్ మలినేని డైరెక్షన్లో నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీర సింహారెడ్డి’ షూటింగ్ కంప్లీట్ అయినట్లు సమాచారం. జనవరి 12న విడుదలకు సిద్ధమవుతున్న ఈ మూవీలో బాలయ్య ట్రిపుల్ రోల్ చేస్తున్నరు! థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పార్ట్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ కు వచ్చేయగా, బ్యాలన్స్ సాంగ్ షూట్ ను కూడా హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో కంప్లీట్ చేసేశారు. దీంతో షూట్ మొత్తం పూర్తయింది.