ముంబైలో దావూద్​ డ్రగ్స్​ ఫ్యాక్టరీ

నడిపేది గ్యాంగ్​స్టర్​ కరీమ్​ లాలా మనవడు

ఆధారాలతో సహా పట్టుకున్న ఎన్​సిబి

By udayam on January 21st / 10:09 am IST

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో అండర్​ వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రహీం ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ అతిపెద్ద డ్రగ్స్​ ఫ్యాక్టరీని నార్కోటిక్స్​ కంట్రోల్​ బ్యూరో (ఎన్​సిబి) అధికారులు పట్టుకున్నారు.

ఈ ఫ్యాక్టరీని ముంబైలోని ఒకప్పటి అతిపెద్ద గ్యాంగ్​స్టర్లలో ఒకడైన కరీమ్​ లాలా మనవడు చింకు పఠాన్​ నడిపిస్తున్నట్లు ఎన్​సిబి అధికారులు ఆధారాలు సంపాదించారు.

చింకు పఠాన్​ను నిన్న రాత్రి అరెస్ట్​ చేశాం. గ్యాంగ్​స్టర్​ కరీం లాలా మనువడైన ఇతడు దావూద్​ ఇబ్రహీంకి మెంటార్​గా వ్యవహరిస్తున్నాడు అని ఓ ఎన్​సిబి అధికారి వెల్లడించారు.

‘‘ఈ ఫ్యాక్టరీని పఠానీ గ్యాంగ్​ మనుషులు నిర్వహిస్తున్నారు. దావూద్​ గ్యాంగ్​కు సైతం దీనితో సంబంధం ఉంది” అని ఎన్​సిబి పేర్కొంది.

ఫ్యాక్టరీ వద్ద భారీ స్థాయిలో డ్రగ్స్​తో పాటు కోటి రూపాయల క్యాష్​ను, ఆయుధాలను సైతం రికవరీ చేశారు. సింఘు పఠాన్​ పార్టనర్​ అయిన ఆరిఫ్​ బుజ్​వాలా మహారాష్ట్రలోనే అతి పెద్ద డ్రగ్​ డీలర్​ అని అధికారులు వెల్లడించారు.