కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దులో ఆందోళనకర పరిస్థితులపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ఘాటుగా స్పందించారు. ఈ ఆందోళనకర పరిస్థితులకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కారణమని పవార్ ఆరోపించారు. మహారాష్ట్ర నుంచి కర్ణాటకలోకి ప్రవేశించే వాహనాలపై దాడులు ఆపకుంటే మరో విధంగా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు. ‘ఒకవేళ సరిహద్దులో శాంతిభద్రతలు క్షీణిస్తే అందుకు పూర్తి బాధ్యత కర్ణాటక ముఖ్యమంత్రి, ఆ ప్రభుత్వానిదే’ అని ఆయన హెచ్చరించారు.