కాన్పూర్​లో ఏం జరుగుతోంది? : వారంలో గుండెపోటుతో 100 మంది మృతి

By udayam on January 10th / 12:13 pm IST

ఉత్తరప్రదేశ్​ లోని కాన్పూర్​ నగరంలో గడిచిన వారం రోజుల్లో ఏకంగా 100 మంది గుండెపోటుతో మరణించడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. వీరిలో 54 మంది ఆసుపత్రికి చేర్చేలోపే మరణించడం గమనార్హం. ఎల్పీఎస్​ ఇన్​ స్టిట్యూట్​ ఆఫ్​ కార్డియాలజీ ఆసుపత్రిలోనే ఏకంగా 44 మంది చికిత్స పొందుతూ మరణించారు. ఇదే ఆసుపత్రిలో గడిచిన వారం రోజుల డేటా ప్రకారం ఏకంగా 723 మంది గుండెపోటుతో చికిత్స కోసం జాయిన్​ అయ్యారు. ఎస్​పిఎస్​ ఆసుపత్రిలో గడిచిన 24 గంటల్లో 14 మంది మరణించారు. ఇక్కడ గుండెపోటుతో 604 మంది చికిత్స తీసుకుంటున్నారు.

ట్యాగ్స్​