‘పరాక్రమ్ దివాస్​’ గా నేతాజీ జయంతి

By udayam on January 19th / 9:53 am IST

కోల్‌కతా: స్వాతంత్ర సమరంలో కీలక పాత్ర పోషించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ప్రతి ఏటా ‘పరాక్రమ్​ దివస్​’గా నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

జనవరి 23న జరిగే ఈ కార్యక్రమంలో పాదయాత్ర నిర్వహించనున్నట్టు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించగా కేంద్రం తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది.

నేతాజీ స్ఫూర్తి, దేశానికి ఆయన అందించిన నిస్వార్థ సేవలను స్మరించుకునేందుకు ఏటా ఆయన జయంతిని ‘పరాక్రమ్ దివస్’గా జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు కేంద్ర సాంస్కృతిక శాఖ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.