ఇజ్రాయెల్ ప్రధాని పదవిని ఆ దేశ మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి దక్కించుకున్నాడు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడిని నిన్న రాత్రి కలుసుకున్న ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తన వద్ద సంఖ్యాబలం ఉందని నిరూపించుకున్నారు. దీంతో 73 ఏళ్ళ నెతన్యాహు వచ్చే ఏడాది జనవరి 2న ఇజ్రాయెల్ ప్రధానిగా మరోసారి ప్రమాణం చేయనున్నాడు. ప్రస్తుతం నెతన్యాహు కూటమికి 64 సభ్యుల మద్దతు ఉంది. దీంతో ఆయన ఇజ్రాయెల్ కు సుదీర్ఘకాలం ప్రధానిగా చేసిన వ్యక్తిగా రికార్డులకెక్కనున్నాడు.