రెండు రోజులు నెట్​ఫ్లిక్స్​ ఫ్రీ

డిసెంబర్​ 5,6 తేదీల్లో ఉచితంగా చూడొచ్చంటున్న స్ట్రీమింగ్​ కంపెనీ

By udayam on November 21st / 8:50 am IST

ప్రముఖ స్ట్రీమింగ్​ సంస్థ నెట్​ఫ్లిక్స్​ భారత్​లో వినియోగదారులను ఆకట్టుకోవడానికి మరో సరికొత్త ప్లాన్​ను సిద్ధం చేసింది.

వచ్చే నెల డిసెంబర్​ 5,6 తేదీలలో తమ స్ట్రీమింగ్​ సర్వీస్​లోని కంటెంట్​ను ఉచితంగా చూసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

ఇందుకోసం ఎలాంటి కార్డ్​ డిటైల్స్​ ఇవ్వవలసిన అవసరం లేదని, ఎలాంటి సబ్​స్క్రిప్షన్​ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని పేర్కొంది.

యూజర్లు తమ పేరు, పాస్​వర్డ్​, ఈ–మెయిల్​ అడ్రస్​ను ఇచ్చి ఫ్రీ అకౌంట్​ను క్రియేట్​ చేసుకోవాల్సి ఉంటుందని నెట్​ఫ్లిక్స్​ సిఒఒ గ్రెస్​ పీటర్స్​ ఒక ప్రకటనలో వెల్లడించారు.