నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ ‘కనెక్ట్’ మూవీపై అప్పుడే ఓటిటి అప్డేట్ వచ్చేసింది. ఈ గురువారమే ధియేటర్లలో విడుదలై మిక్స్డ్ రివ్యూస్ సంపాదించిన ఈ హర్రర్ మూవీ ఓటిటి రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు టాక్. ఇందుకోసం భారీ మొత్తాన్నే నెట్ ఫ్లిక్స్ చెల్లించింది. ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలో నటించిన ఈ మూవీలో సత్యరాజ్, వినయ్ రాయ్, హనియా నఫీసాలు నటించారు.