నెదర్లాండ్స్​ బాల్​ టేంపరింగ్​

By udayam on January 26th / 7:35 am IST

ఆఫ్ఘనిస్థాన్​, నెదర్లాండ్స్​ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్​లో బాల్​ టేంపరింగ్​ వివాదం మరోసారి చర్చల్లోకి వచ్చింది. 31వ ఓవర్ వేస్తున్న నెదర్లాండ్స్​ బౌలర్​ బ్రాండన్​ గ్లోవర్​ క్రమంలో ఫీల్డర్​ వివియన్​ కింగ్​మా బాల్​ను టేంపర్​ చేయడం వీడియోలో రికార్డ్​ అయింది. బాల్​కు షైన్​ చేసే క్రమంలో కింగ్​ మా బాల్​ షేప్​ మార్చే ప్రయత్నం చేశాడు. ఈ విషయాన్ని గమనించిన అంపైర్లు మ్యాచ్​ను ఆపి బాల్​ మార్చడంతో పాటు.. ఆ జట్టుకు 5 పరుగుల పెనాల్టీని విధించారు.

ట్యాగ్స్​