టి20 వరల్డ్ కప్ ఇలా ముగిసిందో లేదో ఐసిసి అప్పుడే 2024 లో అమెరికా, వెస్టిండీస్ దేశాల్లో జరిగే టి20 వరల్డ్ కప్ కోసం సన్నాహాలు మొదలెట్టేసింది.పొట్టి ప్రపంచకప్ కోసం ఈసారి ఏకంగా 20 జట్లు 4 గ్రూపులుగా మారి తలపడనున్నాయి. ఈ 4 గ్రూపుల నుంచి టాప్ 2 జట్లు బయటకు వచ్చి రెండు గ్రూపులుగా సూపర్–8 విధానంలో మ్యాచుల్ని ఆడనున్నాయి. ఈ రెండు గ్రూపుల నుంచి టాప్ 4 జట్లు సెమీస్ కు అర్హత సాధిస్తాయి. ఇప్పటికే అమెరికా, విండీస్ జట్లు ఆతిథ్య హోదాలో ఈ టోర్నీకి అర్హత సాధించగా.. ముగిసిన ప్రపంచకప్ లో టాప్–8 పొజిషన్స్ లో ఉన్న జట్లు, టి20 ర్యాంకింగ్స్ ఆధారంగా ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ లు ఇప్పటికే ఈ టోర్నీకి అర్హత సాధించేశాయి.