ఫుట్ బాల్ లవర్స్ కోసం జియో కొత్త ప్లాన్

By udayam on December 7th / 9:59 am IST

ఫుట్ బాల్ ప్రపంచకప్ అభిమానులకు రిలయెన్స్ జియా నూతన ప్లాన్ ను ప్రకటించింది. రూ. 222తో రీచార్జ్ చేసుకుంటే 30 రోజుల వ్యాలిడిటీతో 50 జీబీ పొందవచ్చు. రెగ్యులర్ ప్లాన్ తో దీనికి సంబంధం లేకుండా ఇది కేవలం అదనపు డేటాను ఇచ్చే ప్లాన్ మాత్రమే. రెగ్యులర్ ప్లాన్ లో రోజువారీ డేటా లిమిట్ అయిపోయిన తర్వాత ఈ డేటా ప్లాన్ ఉపయోగంలోకి వస్తుంది. కావాలంటే ఒక్కరోజులోనే 50జీబీని వాడుకోవచ్చు. కేవలం ఫుట్ బాల్ కోసమే కాకుండా, ఓటీటీ కంటెంట్ కోసమూ ఈ డేటాను వినియోగించుకోవచ్చు.

ట్యాగ్స్​