ఏపీ : 10 నిమిషాలు ఆలస్యమైనా ఉద్యోగులకు జీతం కట్​

By udayam on December 30th / 4:44 am IST

విధులకు ఆలస్యంగా వచ్చే ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం జారీచేసిన తాజా ఆదేశాల ప్రకారం నిర్ధేశించిన సమయానికన్నా పది నిమిషాలు ఆలస్యంగా వచ్చినా జీతంలో కోత పడనుంది. దీంతో ఈ విషయం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తమ అసంతృప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి ఉద్యోగులు సిద్దమవుతున్నారు. ఫేషియల్‌ హాజరుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైనే ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆ విధానం అమలులోకి వచ్చేలోగా హాజరు పుస్తకాన్ని ఎలా వినియోంచాలన్న దానిపై తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

ట్యాగ్స్​