మహేష్ బాబు, కీర్తి సురేష్ల కాంబోలో తెరకెక్కి కలెక్షన్ల పరంగా దూసుకుపొతున్న ‘సర్కారు వారి పాట’లో ఈ వీకెండ్ నుంచి కొత్త పాటను కలపనున్నారు. ఈ మూవీకి రిపీటెడ్ ఆడియన్స్ కోసం మహేష్, కీర్తిల మధ్య వచ్చే ఈ రొమాంటిక్ సాంగ్‌ను జత చేస్తున్నట్లు మేకర్స్ ఈ సర్ప్రైజ్ ఇచ్చారు. ‘మురారి బావ’ అంటూ సాగే ఈ మాస్ సాంగ్ మహేష్ అభిమానులను మరింతగా ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. ఈ పాట ఆడియో వర్షన్ సైతం ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది.