వీడియో: ఆప్​ మంత్రికి జైలులో ఉన్నా పంచభక్ష పరమాన్నాలే

By udayam on November 23rd / 9:13 am IST

లిక్కర్​ స్కాంలో అరెస్ట్​ అయి తీహార్​ జైలులో ఉన్న ఢిల్లీ ఆప్​ మంత్రి సత్యేందర్​ జైన్​ కు అక్కడ రాజభోగాలు అందుతున్నాయన్న వార్తలో నిజం ఉందని తేలింది. జైలులో ఉన్న అతడిని అధికారులు తోటి ఖైదీలాగా కాకుండా విఐపి ట్రీట్​మెంట్​ చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరో కొత్త వీడియో ‘లీక్’​ అయింది. జైలులో నుంచే రెస్టారెంట్ల నుంచి ఆర్డర్​ చేసుకున్న ఫుడ్​ ను మంత్రి దర్జాగా తింటున్నట్లు ఈ వీడియోల్లో క్లియర్​ గా ఉంది. అంతకు ముందు జైలులో రేప్​ కేసులో నిందితుడితో మసాజ్​ చేయించుకున్న మంత్రి వీడియో లీక్​ కావడం.. దానిపై బిజెపి, ఆప్​ లు తీవ్రంగా వాదులాడుకోవడం మనం చూసిందే.

ట్యాగ్స్​