ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా అగ్రరాజ్యం ఆర్దిక రాజధాని న్యూయార్క్ ఎంపికైంది. గతేడాది తొలిస్థానంలో ఉన్న సింగపూర్ ఈ ఏడాది న్యూయార్క్ తో కలిసి తొలి స్థానాన్ని పంచుకుంది. ది ఎకనమిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ సర్వే ప్రకారం మొత్తం 172 దేశాల జాబితాలో తర్వాత టెల్ అవీవ్ మూడో స్థానాన్ని దక్కించుకుంది. మరోవైపు భారత్లోని అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు జీవన వ్యయంలో అత్యంత చౌక అయిన నగరాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి.ఈ జాబితాలో బెంగళూరు 161వ ర్యాంకులో, చెన్నై 164వ ర్యాంకులో, అహ్మదాబాద్ 165వ ర్యాంకులో నిలిచింది.