న్యూజిలాండ్​: 16 ఏళ్లకు ఓటు హక్కు పై త్వరలోనే నిర్ణయం

By udayam on November 23rd / 11:54 am IST

ఓటు హక్కును 18 ఏళ్ల నుండి 16 ఏళ్లకు తగ్గించడంపై చట్టసభ సభ్యుల నిర్ణయం తీసుకుంటామని న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌ తెలిపారు. 16 ఏళ్లకు ఓటు హక్కును కల్పించాలని ఆ దేశ సుప్రీంకోర్ట్​ ఇప్పటికే తన తీర్పును ప్రకటించింది. ఈ ఉత్తర్వులకు తాను మద్దతిస్తున్నానని, ఈ ప్రతిపాదనను పార్లమెంట్‌లో ప్రవేశ పెడతామని జెసిండా ఆర్డెర్న్‌ పేర్కొన్నారు. రాబోయే నెలల్లో ఈ బిల్లుపై పార్లమెంట్‌లో చర్చిస్తామన్నారు.ఆ దేశ రాజ్యాంగం ప్రకారం ఇలాంటి వాటిపై పార్లమెంట్‌లోని 75శాతం మంది సభ్యులు ఆమోదం తెలపాల్సి ఉంటుంది.

ట్యాగ్స్​