కేరళ వాసులు చూపిస్తున్న అభిమానానికి బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెయ్ మార్ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మేరకు కోజికోడ్ జిల్లాలోని ఓ నదిలో ఏర్పాటు చేసిన తన భారీ కటౌట్ ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన నెయ్ మార్ కేరళ అభిమానులకు థాంక్స్ చెప్పాడు. ఈ పోస్ట్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెయ్ మార్ అభిమానుల నుంచి 4.50 లక్షల లైక్స్ పడ్డాయి. ఈ నదిలో నెయ్ మార్ కటౌట్ తో పాటు పోర్చుగల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో, అర్జెంటీనా ప్లేయర్ లియోనెల్ మెస్సీలవి కూడా 30 అడుగల కటౌట్స్ ఏర్పాటు చేశారు. నెయ్ మార్ కంటే ముందు ఫిఫా అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోలు షేర్ చేసింది.
#FIFAWorldCup fever has hit Kerala 🇮🇳
Giant cutouts of Neymar, Cristiano Ronaldo and Lionel Messi popped up on a local river ahead of the tournament.
12 days to go until #Qatar2022 🏆 pic.twitter.com/29yEKQvln5
— FIFA.com (@FIFAcom) November 8, 2022