తెలంగాణకు ఎన్​జిటి భారీ జరిమానా

By udayam on October 4th / 6:05 am IST

తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్​ భారీ జరిమానాను విధించింది. వ్యర్ధాల నిర్వహణలో అలసత్వంగా ఉన్నారంటూ రూ.3,800 కోట్ల జరిమానాను విధించింది. దాంతో పాటు ఈ మొత్తాన్ని రెండు నెలల్లోగా ప్రత్యేక ఖాతాలో జమ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. 1996లో మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య, వ్యర్ధాల నిర్వహణ సరిగా లేదని పర్యావరణ సురక్షా అనే సంస్థ సుప్రీంలో వేసిన పిటిషన్​ ఆపై ఎన్​టిజికి చేరింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. 351 నదీ పరివాహక ప్రాంతాలు, 124 నగరాల్లో గాలి కాలుష్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ భారీ జరిమానా విధించింది.

ట్యాగ్స్​