తెలంగాణకు ఎన్జీటీ రూ.920 కోట్ల భారీ జరిమానా

By udayam on December 23rd / 6:12 am IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటి) భారీ జరిమానా విధించింది. కృష్ణా నదిపై నిర్మిస్తోన్న పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు చేయనందుకు రూ.920 కోట్ల జరిమానా విధిస్తూ ఎన్‌జిటి చెన్నై బెంచ్‌ గురువారం తీర్పు వెలువరించింది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణం సహా అనేక ఇతర అనుమతులు లేవని, నిర్మాణాలను నిలుపుదల చేయాలని గతంలోనే తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్‌జిటి ఆదేశించింది.

ట్యాగ్స్​