తమిళనాడు: 9 మంది శ్రీలంక జాతీయులు అరెస్ట్​.. ఎల్టీటీఈ లోకి రిక్రూట్​ మెంట్​ ప్లాన్​

By udayam on December 20th / 10:41 am IST

తమిళనాడులో 9 మంది శ్రీలంక జాతీయుల్ని జాతీయ దర్యాప్తు బృందం అరెస్ట్​ చేసింది. వీరంతా మన దేశంలో నిషేధిత ఎల్​.టి.టి.ఈ. ఉగ్రవాద సంస్థకు రిక్రూట్​ మెంట్​ జరుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. శ్రీలంక నుంచి వచ్చి తమిళనాడు లో ఉంటున్న తమిళ నిరాశ్రయులే లక్ష్యంగీ వీరు లిబరేషన్​ టైగర్స్​ ఆఫ్​ తమిల్​ ఈళం లో రిక్రూట్​ మెంట్​ కు ప్రయత్నించారని తెలుస్తోంది. అరెస్ట్​ అయిన వారిలో ఇద్దరు శ్రీలంక వాసులు.. పాక్​ కు చెందిన డ్రగ్​ డీలర్​ హాజి సలీమ్​ తో నిరంతరం టచ్​ లో ఉన్నారని, దుబాయ్​, పాక్​, ఇరాన్​ దేశాలకు వీరిద్దరూ తరచూ ప్రయాణిస్తున్నారని గుర్తించారు.

ట్యాగ్స్​