మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఉగ్రవాది కుల్విందర్‌జిత్ సింగ్ అలియాస్ ఖాన్‌పూరియాను న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ ఐఏ అరెస్టు చేసింది.ఖాన్ పురియాకు బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ సహా తీవ్రవాద సంస్థలతో సంబంధం ఉందని ఎన్ ఐఏ లోగడ గుర్తించిన విషయం తెలిసిందే. 2019 నుంచి పరారీలో ఉన్న కుల్విందర్ జిత్ సింగ్ ఈరోజు బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి వస్తున్నాడన్న పక్కా సమాచారంతో ఎన్ ఐఏ అధికారులు విమానాశ్రయాన్ని అష్టదిగ్భంధనం చేశారు.విమానం ల్యాండ్ కాగానే కుల్విందర్ జిత్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు.