అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం హవాలా నెట్‌వర్క్‌పై ఈరోజు ఎన్ఐఎ ఏకకాలంలో దాడులు చేసింది. ముంబైలోని బోరివలి, గోరేగావ్, పరేల్, శాంటాక్రూజ్ ప్రాంతాల్లో దావాద్ తరపున పనిచేస్తున్న హవాలా ఆపరేటర్లు, డ్రగ్ స్మగర్లు, రియల్ ఎస్టేట్ మేనేజరల్ ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంగా సోదాలు జరిపింది. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ వేత్తలే లక్ష్యంగా దావూద్ ఓ ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేసి బెదిరింపులకు దిగుతున్నాడన్న సమాచారంపై ఈ సోదాలు జరిగాయి.