టి20 వరల్డ్ కప్ లో కనీసం అర్హత సాధించలేకపోయిన విండీస్ జట్టులో తొలి వికెట్ పడింది. ఆ జట్టు వైట్ బాల్ కెప్టెన్ నికోలస్ పూరన్ తన కెప్టెన్సీకి రాజీనామా ఇచ్చేశాడు. పోలార్డ్ రిటైర్మెంట్ తర్వాత ఈ ఏడాది మే లోనే ఆ జట్టుకు పూర్తి స్థాయి వైట్ బాల్ కెప్టెన్ గా పూరన్ నియమితులయ్యాడు. టి20 వరల్డ్ కప్ లో ఘోర పరాభవం తర్వాత విండీస్ క్రికెట్ బోర్డ్ లారా, మిక్కీ ఆర్థర్, జస్టిస్ పాట్రిక్ థాంప్సన్ లతో కూడిన త్రిసభ్య కమిటీని జట్టు నిష్క్రమణ, మార్పులపై సూచనల కోసం నియమించిన సంగతి తెలిసిందే.