దాదాపు 300లకు పైగా మహిళలను పెళ్ళి పేరుతో వంచించిన ఓ నైజీరియా దేశస్తుడిని ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నిందితుడు కోట్ల రూపాయల్లో దండుకున్నాడని పేర్కొన్నారు. సోషల్ మీడియా, మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్ ద్వారా నిందితుడు మహిళకు దగ్గరయ్యేవాడని, ఆపై మాయమాటలు చెప్పి వారి వద్ద నుంచి డబ్బులు గుంజేవాడని తెలిపారు. తాను ఎన్ఆర్ఐ నని, కెనడాలో సెటిల్ అయ్యానంటూ అతడు చెప్పిన మాటలు నమ్మిన మహిళలు డబ్బులు పంపేవారని పోలీసులు వెల్లడించారు.