ఎలక్షన్​ కమిషన్​ సెక్రటరీ తొలగింపు

నిమ్మగడ్డ మరో సంచలన నిర్ణయం

By udayam on January 12th / 12:45 pm IST

అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎస్​ఇసి సెక్రటరీగా ఉన్న వాణీ మోహన్‌ను విధుల నుంచి తొలగించారు.

ఈ మేరకు ఎపి ప్రభుత్వ సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ ‌కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లేఖ రాశారు. వాణీమోహన్‌ సేవలు ఎన్నికల కమిషన్‌లో అవసరం లేదని ఆ లేఖలో నిమ్మగడ్డ వివరించారు. వాణీమోహన్‌ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

నిన్నటి రోజున ఎస్​ఇసి జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్‍ను ఉద్యోగం నుంచి తొలగించడంపై వివాదం చేలరేగగా దానిపై ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది.

సాయి ప్రసాద్​ 30 రోజులపాటు సెలవుపై వెళ్ళడమే కాకుండా.. కార్యాలయంలోని ఇతర ఉద్యోగులను సైతం సెలవుపై వెళ్లేలా ప్రభావితం చేశారని అభియోగాలు ఉన్నాయని, అందుకే దీన్ని క్రమశిక్షణారాహిత్యంగా పరిగణించి సాయి ప్రసాద్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈరోజు వివరణ ఇచ్చింది.

ఇతర ప్రభుత్వ సర్వీసులలో ప్రత్యక్షంగా లేదా.. పరోక్షంగా విధులు నిర్వహించడానికి వీల్లేదని ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది.