పరారీలో ఉన్న భారత వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి బ్రిటన్ కోర్టులో చుక్కెదురైంది. మోసం, మనీలాండరింగ్ కేసులో విచారణకు తనను భారత్‌కు అప్పగించాలన్న నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అనుమతించాలన్న నీవర్ మోడీ పిటిషన్‌ను గురువారం అక్కడి కోర్టు తిరస్కరించింది. 2018లో పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ మోసానికి పాల్పడినట్లు నిర్థారణ కావడంతో నీరవ్ మోడీ భారత్ నుండి పారిపోయిన సంగతి తెలిసిందే. తనను రప్పిస్తే ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉందని వాదించినట్లు మీడియా రాయిటర్స్ తెలిపింది.