నీరవ్​ : సుప్రీంకోర్టు కెళతా అనుమతివ్వండి

By udayam on November 24th / 12:30 pm IST

తనను భారత్‌కు అప్పగించాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా బ్రిటన్‌ సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకోవడానికి అనుమతి కోరుత పరారీలో ఉన్న డైమండ్‌ వ్యాపారి నీరవ్‌ మోడీ హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును రూ.13 వేల కోట్ల మేరకు మోసగించిన నీరవ్‌ మోడీ బ్రిటన్‌కు పారిపోయిన సంగతి తెలిసిందే. మానసిక అనారోగ్య కారణాల రిత్యా తనను భారత్‌కు అప్పగించవద్దంటూ ఈ నెల ప్రారంభంలో చేసిన అప్పీల్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ అప్పీల్‌ను కొట్టివేయడం వల్ల నీరవ్‌ మోడీపై సిబిఐ, ఇడిలు పెద్ద విజయం సాధించినట్లైంది.

ట్యాగ్స్​