ఇటీవల అనారోగ్యంతో ఢిల్లీ లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. కడుపునొప్పికి మూడు రోజుల చికిత్స తీసుకున్న అనంతరం ఆమెకు నయం కావడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. నిర్మలా సీతారామన్ వచ్చే రెండు నెలల్లో దేశ ఆర్ధిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ప్రీ బడ్జెట్ సమావేశాలను కూడా ఆమె పూర్తి చేశారు. ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం నుంచి చివరి బడ్జెట్ ఇదే కానుంది.